Sunday, November 24, 2024
Homeతెలంగాణరేపు స్కూళ్లు బంద్

రేపు స్కూళ్లు బంద్

పిలుపునిచ్చిన ఏబీవీపీ
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: పాఠశాలల్లో ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మంగళవారం 5వ తేదీన బంద్ పాటించాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మౌలిక వసతులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో పాఠశాల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్‌ సురేష్‌ వెల్లడించారు.
ఈనెల2న పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన 34మంది విద్యార్థులపై అక్రమంగా బనాయించిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిమాండ్‌లో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలన్నారు. పాఠశాలలు ప్రారంభమై 20రోజులు గడుస్తున్నా… పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకువచ్చి కార్పొరేట్ పాఠశాలలను సీజ్‌ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments