Tuesday, April 15, 2025
Homeతెలంగాణనేటి నుంచే అమల్లోకి ఎస్సీ వర్గీకరణ

నేటి నుంచే అమల్లోకి ఎస్సీ వర్గీకరణ

నేటి నుంచే అమల్లోకి ఎస్సీ వర్గీకరణ

తొలి ప్రతి అందుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి..

స్పాట్ వాయిస్, బ్యూరో:   రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమల్లోకి రానుంది. దాదాపు 30ఏళ్లపాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీకానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్​ అంబేడ్కర్‌ జయంతి రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్‌రెడ్డికి అందించాలని వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

 

59 ఎస్సీ ఉప కులాలు

ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 59 ఎస్సీ ఉప కులాల మధ్య ఉన్న అంతర్గత వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకుని మూడు గ్రూపులుగా విభజించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో పాటు రాష్ట్ర గవర్నర్ సైతం ఆమోదం తెలిపారు.

2026 లెక్కల తరువాత 15శాతం..

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీల జనాభా 17.5 శాతానికి చేరిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఎస్సీలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్లను పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉత్తమ్ ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments