Tuesday, November 26, 2024
Homeతెలంగాణకాళేశ్వరంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పూజలు

కాళేశ్వరంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పూజలు

కాళేశ్వరంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పూజలు
ప్రాజెక్టు ను సందర్శించిన బండ శ్రీనివాస్
స్పాట్ వాయిస్, మహదేవపూర్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని పంప్ హౌస్ ను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ కు చెందిన 200 మంది సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వాకర్స్ అసోసియేషన్ సభ్యులకి ఆయన వివరించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం అని, దానికి 2 మే 2016 న శంకుస్థాపన జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొన్ని బ్యారేజీలు, పంపు హౌజ్ లు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం అని, అన్నీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం కలిగి ఉంటుందన్నారు. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వ్యవసాయానికి వినియోగించు కోవడానికి వీలుగా ఈ ప్రాజెక్ట్ ను రూపొందించారన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అన్నారు. ప్రధానంగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత, దమ్మూరు వద్ద కలిసే ఇంద్రావతి నదుల జలాల వినియోగం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 195 టీఎంసీల నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందించారన్నారు. ముందుగా ఆయన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి అనుబంధ దేవాలయమైన సుభానందా దేవి (పార్వతి) అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేశారు. మొదట వారికి ఆలయ తూర్పు రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ వర్గాలు, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అడప సమ్మయ్య, కామిడి రాంరెడ్డి, శ్యాంసుందర్, ఎంపీటీసీ రేవెళ్లి మమత, నాగరాజు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments