Thursday, January 30, 2025
Homeతెలంగాణసర్పంచ్ ఎన్నికలపై త్వరలోనే స్పష్టత

సర్పంచ్ ఎన్నికలపై త్వరలోనే స్పష్టత

ప్రభుత్వానికి అందనున్న బీసీ రిజర్వేషన్ నివేదిక
కేబినెట్ భేటీ తర్వాత తుది నిర్ణయం
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై త్వరలోనే స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత.. ఎన్నికలపై సర్కార్ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో బీసీ కమిషన్ నివేదికను సమర్పించనుండగా.. ఆ తర్వాత కేబినెట్ భేటీలో చర్చించి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా పథకాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఇదే సరైన సమయమని ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేలాల్సి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి నివేదికను సిద్ధం చేయగా.. త్వరలోనే సర్కార్‌కు సమర్పించనుంది. ఆ నివేదకను కెబినెట్ లో చర్చించి ఆమోదించి… ఆ తర్వాత హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బీసీ కమిషన్‌ నివేదికపై చర్చించి, రిజర్వేషన్లపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వ పంపించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో చర్చించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments