మంత్రి సీతక్క..
స్పాట్ వాయిస్, బ్యూరో: సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మంత్రి సితక్క వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచులకు చెల్లించాల్సిన 16 నెలల బిల్లులకు సంబంధించిన రూ.1200 కోట్లను గత సర్కార్ పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఎప్పటికప్పుడు సర్పంచుల బిల్లులు చెల్లిస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. జీతాలు పింఛన్లు చెల్లించడానికి కూడా అక్కడ ఏమీ లేదన్నారు. ఉద్యోగులకు ప్రతినెలా 5లోపు జీతాలు, పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీతక్క వివరించారు. ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులు, నిధులను కట్టడాలకు తమ సొంత అవసరాలకు వృథాగా ఖర్చు చేయడం లేదని సీతక్క అన్నారు. ప్రజల సంక్షేమం కోసమే నిధులను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని సీతక్క స్పష్టం చేశారు.
సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో కష్టం..
RELATED ARTICLES
Recent Comments