Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుభక్తిశ్రద్ధలతో సరస్వతీ పూజ

భక్తిశ్రద్ధలతో సరస్వతీ పూజ

స్పాట్ వాయిస్, హన్మకొండ: ఎర్రగట్టు గుట్ట బసవ రెడ్డి టౌన్ షిప్ లోని విఘ్నేశ్వరుడి వద్ద సూదం హారిక-సాంబమూర్తి దంపతులు భక్తిశ్రద్ధలతో సరస్వతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బసవ రెడ్డి టౌన్ షిప్ విగ్నేశ్వర భక్తమండలి ఉపాధ్యక్షుడు పాండ్రాల విక్రమ్ మాట్లాడుతూ సరస్వతి పూజ అనంతరం కాలనీలోని విద్యార్థులందరికీ సూదం హారిక సాంబమూర్తి దంపతులు నోట్ బుక్స్, పలకలు పెన్నులు బహూకరించారన్నారు. విఘ్నేశ్వర భక్త మండలి అధ్యక్షుడు మన్సూర్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు పర్వదినాలు సామూహికంగా చేసుకోవడం ఐక్యతకు చిహ్నమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, పాపయ్య, సంగినేని రవీందర్, భాస్కర్ రెడ్డి, పోరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, దేవేందర్, రాజిరెడ్డి, మేకల కుమార్, రవీందర్ రెడ్డి, లక్ష్మీరాజం, ఆకుల రంజిత్ కుమార్, హరి ప్రసాద్, మోహన్, పున్నం, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments