Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుమొక్కలు నాటడం అందరి బాధ్యత

మొక్కలు నాటడం అందరి బాధ్యత

మొక్కలు నాటడం అందరి బాధ్యత
ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో వేయి మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి హాజరై రోడ్డుకిరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు భాధ్యతగా భావించి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని అన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కందగట్ల నరహరి, ఎంపీడీవో మల్లేశంగౌడ్, ఎంపీవో కొమురయ్య, ఉపసర్పంచ్ జక్క దూడయ్య, ప్రత్యేక అధికారి బొజ్జ సురేశ్, ఏపీవో లక్ష్మి, టీఏ రాజు, కార్యదర్శి వాజిద్, కారోబార్ వీరస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్, కోఆప్షన్ మెంబర్ భూసాని మొగిలి, వీవోఏ మాధవి, స్వయం సహాయక సంఘాల మహిళలు, యువజన సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments