Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలులారీలను తనిఖీ చేసిన పీవో

లారీలను తనిఖీ చేసిన పీవో

లారీలను తనిఖీ చేసిన పీవో

స్పాట్ వాయిస్, మహదేవపూర్: మహదేవపూర్ మండలం కాళేశ్వరం పరిధిలో వెళ్తున్న ఇసుక లారీలను తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భూపాలపల్లి జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ తారక్ నాథ్ రెడ్డి తనిఖీ చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆదివారం కాళేశ్వరం నుంచి పూస్కుపల్లి వరకు రోడ్డుపై వెళ్తున్న లారీలను ఆపి తనిఖీలు చేశారు. ప్రతీ లారీని ఆపి క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీ డ్రైవర్లు ప్రతి ఒక్కరు వాహనానికి సంబంధించి సరైన పత్రాలు తమ దగ్గర ఉంచుకోవాలని, నిబంధనలు పాటిస్తూ లారీలను నడపాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు నిబంధనలకు మించి అధిక లోడ్ తో వెళ్తే చట్ట పరమైన చర్యలతో పాటు, భారీ జరిమానా విధిస్తామని తారక్ నాథ్ రెడ్డి హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments