Tuesday, November 26, 2024
Homeజనరల్ న్యూస్ఉప్పు.. గుండెకు ముప్పు

ఉప్పు.. గుండెకు ముప్పు

హార్ట్ స్ట్రోక్ ఇదే కారణమంటున్న డబ్ల్యూహెచ్ వో
రోజు వాడాల్సింది 5 గ్రాములే.. వాడుతున్నది 10 గ్రాములు..
వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
స్పాట్ వాయిస్, బ్యూరో : కొద్ది రోజులుగా ప్రపంచాన్ని హార్ట్ స్ట్రోక్ వణికిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా గుండె ఒక్కసారిగా స్టక్ అవుతోంది. ఛాతిలో నొప్పి మొదలై.. చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణం విడిస్తున్నారు. ఎంతో హెల్తీగా ఉన్న వారు సైతం ఊపిరి వదులుతున్నారు. క‌రోనా త‌ర్వాత చిన్నా పెద్దా తేడా లేకుండా పలువురు గుండెపోటుకు గురవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు కారణాలు చెబుతూ ఒక నివేదిక విడుదల చేసింది. ఉప్పు అధికంగా వాడడం వల్లే గుండెపోటు వస్తున్నట్లు పేర్కొంది. ఉప్పు మోతాదు పెంచితే అనారోగ్య సమస్యలు వస్తాయని.. మితిమీరిన ఉప్పు వాడకం వల్ల గుండెపోటు మాత్రమే కాకుండా ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వస్తాయని డబ్ల్యూహెచ్ వో నివేదికలో వెల్లడించింది. నిర్దేశించిన ప్రమాణాల మేరకు రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పును మాత్రమే వాడాలని, కానీ, ప్రపంచంలో అందుకు విరుద్ధంగా 10 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారని పేర్కొంది. గుండెపోటు వంటి హఠాన్మరణాలకు అనారోగ్యపు ఆహారపు అలవాట్లే కారణమని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. 2025 నాటికి ప్రపంచంలో ప్రపంచంలో సోడియం వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యం ఆచరణలో కనిపించడం లేదని డబ్ల్యూహెచ్ వో ఆందోళన వ్యక్తం చేసింది. ఉప్పు వాడకం తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడవచ్చని డబ్ల్యూహెచ్ వో నివేదిక చెబుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments