Monday, November 25, 2024
Homeతెలంగాణసైఫ్ ను ఉరితీయాలి

సైఫ్ ను ఉరితీయాలి

వైద్య విద్యార్థిని ప్రీతి మరణం బాధాకరం.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి
బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ
స్పాట్ వాయిస్, హన్మకొండ: వైద్యవిద్యార్థిని ప్రీతి మృతికి కారణమైన సైఫ్ ను వెంటనే ఉరితీయాలని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్ చేశారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని.. బీజేపీ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ కార్యాలయం నుంచి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ.. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్ వైద్య విద్యార్థి “సైఫ్” తనను వేధిస్తున్నాడని ప్రీతి పలుసార్లు ఫిర్యాదు చేసినా కేసీఎంసీ ప్రిన్సిపాల్, హెచ్ఓడీ, స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ను నియంత్రించలేని కేసీఆర్ ప్రభుత్వం ప్రీతి మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రీతిపై కక్ష కట్టి మానసికంగా వేధిస్తూ తన చావుకు కారణమైన ‘సైఫ్’ను ఉరి తీయాలి, దీనికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలన్నారు. ప్రీతి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తన మొబైల్ ను ఉపయోగించి కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్ లో ప్రీతి లాంటి విద్యార్థులు అర్థాతరంగా జీవితాన్ని ముగించుకోకుండా కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి, కార్పొరేటర్లు రావుల కోమల కిషన్, గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తోపుచర్ల అర్చన మధు సూదన్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కేతిరెడ్డి విజయలక్ష్మి, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ, జిల్లా నాయకులు కురిమిండ్ల సది, అల్లెపు వేణు, రఘుపతి, నర్మెట్ట శ్రీనివాస్, కడవేరు శ్రీనివాస్, హరీష్, అరణ్య రెడ్డి, శ్రీరాం రెడ్డి, శ్రీరంగం సాగర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments