Monday, November 25, 2024
Homeతెలంగాణనాటకాలు నిజ జీవితానికి ప్రతిబింబాలు

నాటకాలు నిజ జీవితానికి ప్రతిబింబాలు

మానవీయ విలువలు పెంపొందించేలా ఉండాలి..
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రెండో రోజు అలరించిన నాటికలు
‘సహృదయ’ సేవలను కొనియాడిన అతిథులు 
స్పాట్ వాయిస్, కల్చరల్ : నాటకాలు ప్రజల నిజ జీవితానికి ప్రతిబింబాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ వరంగల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 23వ తెలుగు బాషా ఆహ్వాన పోటీల్లో భాగంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో ఆదివారం రెండో రోజు నిర్వహిస్తున్న నాటికలను సీపీ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటకాలు నిజ జీవితానికి ప్రతిబింబాలని, దారితప్పుతున్న యువత చెడు అలవాట్లకు లోనై వివిధ సైబర్ నేరాలకు పాలుపడుతున్నారని వాపోయారు. నాటికలు యువతను సన్మార్గంలో నడపడానికి తోడ్పడాలని, మానవీయ విలువలు పెంపొందించేలా ఉండాలని సందేశం ఇచ్చారు. ప్రాయోజక దాతలు డాక్టర్ కేఎల్ వీ ప్రసాద్, డాక్టర్ ఏవీ నరసింహారావు, పరాంకుశం వెంకట కృష్ణ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ హైదరాబాద్, మల్యాల మనోహర రావు ప్రసంగించారు.

అనంతరం అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థం మొదటినాటికగా ఎన్.రవీందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించారు. సృష్టిలో ప్రేమ గొప్పదే కానీ అది అందరూ హర్షించే విధంగా ఉండాలి. ఓ తండ్రి తన కొడుకు ప్రేమించిన అమ్మాయి తండ్రి బాధను అర్థం చేసుకొని పిల్లల తప్పిదాలను సరిదిద్దుతూ ఆదర్శవంతమైన తండ్రిగా నిలబడ్డాడు. అలాంటి తండ్రి ఉన్న ఇల్లు ఇంద్రప్రస్థమవుతుందనే సందేశంతో సాగిన నాటిక బాధ్యతలను, బంధాలను గుర్తుచేస్తూ ఆర్థ్రభరితంగా సాగింది. తండ్రి సర్వేశ్వరయ్య పాత్రలో రవీందర్ రెడ్డి, సౌందర్య పాత్రలో కుసుమ సాయి పాత్రలకు ప్రాణం పోశారు. నటీ నటులంతా పోటీపడి నటించారు. చైతన్య భారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం నాటిక ప్రేక్షకులను ఆలోచింజేసింది. మంచాల రమేశ్ దర్శకత్వం లో ప్రదర్శించబడిన ఈ నాటిక ఒక్క కాకి కిందపడితే ఏ బంధం లేకపోయినా వందలాది కాకులు మూగుతాయి. భార్యాభర్తల బంధానికి విలువ నిచ్చే మనుషులం, కాకికి ఉన్న ఙ్ఞానం లేకపొతే ఎలా..? అన్న సందేశం ఇస్తుంది ఈ నాటిక. పరమాత్ముని శివరాం, మంచాల రమేశ్, ఉషశ్రీ, గిరి తదితరులు లీనమై నటించి రక్తి కట్టించారు. వనం లక్ష్మీకాంతరావు సంయోజకులుగా వ్యవహరించారు. సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ వరంగల్ అధ్యక్షుడు గిరిజామనోహరబాబు, కుందావజ్జల, డాక్టర్ ఎన్ వీ ఎన్ చారి. డాక్టర్ ఎం.రాధాకృష్ణ, లక్ష్మణ్ రావు, కళారాజేశ్వర రావు, జూలూరి నాగరాజు, సీతా వెంకట్, నాగిళ్ల రామశాస్త్రి, రవీందర్ రావు, మామిడి రమేశ్, సోల్జర్ షఫి, కవులు, కళాకారులు, కళాభిమానులు, ప్రేక్షకులు పెద్దసంఖ్యలో హాజరయ్యి నాటికలను ఆసాంతం తిలకించారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments