పెళ్లింట్లో విషాదం
చెట్టుకు ఢీకొన్న బైక్..
అక్కడికక్కడే వ్యక్తి మృతి
స్పాట్ వాయిస్, మహబూబాబాద్ : మూడు రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ప్రమాదవశాత్తు ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామ శివారు చంద్రు తండాకు చెందిన భూక్య ఇండియా తన కొడుకు పెళ్లి శుభలేఖలు పంచేందుకు బైక్పై తొర్రూరు మండలం సోమారం గ్రామ శివారు తండాకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్అదుపుతప్పి సోమారం గ్రామం వద్ద చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో భూక్య ఇండియా నాయక్ అక్కడికక్కడే చనిపోయాడు. మూడు రోజుల్లో కొడుకు పెళ్లి జరగాల్సి ఉండగా, ప్రమాదంలో ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Recent Comments