ఏనుమాముల మార్కెట్ లో రైతుల ఆందోళన
ధరలు సగనికి తగ్గించారంటు ఫైర్
స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో రైతులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మిర్చి సీజన్ కావడంతో సోమవారం మార్కెట్కు మిర్చి భారీగా వచ్చింది. దీనితో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తాగించారు. మొన్నటి వరకు రూ.25 వేలు పలికిన వండర్ హాట్ రకాన్ని 15000లకే ఖరీదు చేశారని, అలాగే 15 వేలు అమ్మే 1048, 5531,రకం మిర్చిని 8వేలకు, తేజా రకం 20వేలు ఉండగా 12 వేలకు ఖరీదు చేస్తున్నారంటు ధర్నాకు దిగారు. మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడి చేసారు. దీనితో మార్కెట్ లో ఆందోళన పరిస్థితులు నెలలకొన్నాయి.
Recent Comments