గంజాయి సాగు చేస్తున్నారంటూ ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ లేఖ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ర్టంలోని వివిధ జిల్లాల్లో 148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని ప్రభుత్వానికి ఎక్సైజ్‌శాఖ లేఖ రాసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ జిల్లాల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసింది. మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కు చెందిన 148 మంది రైతులపై 121 కేసులు నమోదయ్యాయి. వీరికి జూన్‌లో వస్తున్న రైతుబంధును రైతులకు ఇవ్వొద్దని ఎక్సైజ్‌శాఖ లేఖలో పేర్కొంది. నల్గొండ, సూర్యాపేటలో సైతం గంజాయి పండిస్తున్న రైతుల వివరాలను ఎక్సైజ్ శాఖ సేకరించింది. 148 మంది రైతుల ఆధార్‌కార్డులు, ల్యాండ్ డాక్యుమెంట్లను కలెక్టర్లకు పంపించింది.
148 మందికి రైతు బంద్ కట్..
RELATED ARTICLES
Recent Comments