షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలి
పీఏసీస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
స్పాట్ వాయిస్, గణపురం: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు షరతుల్లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని గణపురం పీఏసీస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోరెడ్డి మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు ఎక్కువగా ఇచ్చే ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో ప్రభుత్వం ప్రకటించిన ఏ ఒక్క రైతుకు రుణమాఫీ వర్తించలేదని, గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ 2021-22 మార్గదర్శకాల ప్రకారం సుమారు రూ.2 కోట్లు మూడు విడతలుగా మాఫీ జరిగిందని, అప్పటి రెన్యూవల్ అగ్రిమెంట్ జరిగితే సొసైటీ రైతులందరూ అర్హత పొందుతారని అన్నారు. సహకార రుణాలు తీసుకున్న రైతులు న్యాయం చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొవాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో జీవోలకు, సీఎం మాటలకు పొంతన లేకుండా ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేయడం విడ్డూరంగా ఉందని, ఆగస్టు15 వ తేదీలోగా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమని, రుణమాఫీ అమలు కానీ రైతుల తరఫున బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు.
Recent Comments