Sunday, April 20, 2025
Homeటాప్ స్టోరీస్నేడే ఆర్టీసీ పందెం కోడికి వేలం

నేడే ఆర్టీసీ పందెం కోడికి వేలం

నేడే ఆర్టీసీ కోడికి వేలం

అందరూ ఆహ్వానితులే 

స్పాట్ వాయిస్, బ్యూరో: రెండు రోజుల క్రితం కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడికి శుక్రవారం 3 గంటలకు డిపో-2 ఆవరణలో వేలం వేయనున్నారు. నిబంధనల ప్రకారం లాస్‌ ఆఫ్‌ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించాల్సి ఉంటుందని డిపో-2 మేనేజర్‌ మల్లయ్య తెలిపారు. ఈ పందెం కోడి కోసం ఎవరూ రాకపోవడంతో శుక్రవారం వేలం వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనవచ్చని సూచించారు. వచ్చిన మొత్తాన్ని ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments