టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ
టికెట్ పై రూ.5 నుంచి రూ.10 వరకు పెంపు..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం వేసింది. ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టోల్ చార్జీల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా బస్సుల్లో టికెట్ చార్జీలను పెంచింది. ఒక్కో టోల్‌తో రూ.5 నుంచి అదనంగా టికెట్ చార్జీలు వసూలు చేస్తోంది. కొన్ని బస్సులకి అంటే అదనపు టోల్ కు అదనపు చార్జ్ లెక్కన రూ. 10 చొప్పున పెంచేశారు. ఉదయం నుంచి అన్ని బస్సుల్లో టికెట్ ఛార్జీలను ఆర్టీసీ సామాన్యుడిపై మరింత భారం వేసింది. ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా..ఏకంగా బస్ భవన్ నుంచి వాట్సాప్ ద్వారా ఆర్టీసి ఉద్యోగులకు సమాచారం ఇచ్చి ఆర్టీసీ చార్జీలు పెంచండంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రకటన చేయకుండా టీఎస్ ఆర్టీసీ చార్జీలను పెంచడంపై స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పెంచిన ధరలు ఇలా..
పెంచిన బస్సు చార్జీలు పరిశీలిస్తే ఆర్డీనరీ నుంచి గరుడ ప్లస్ బస్సుల వరకు రూ.4 టోల్ ఛార్జీలను పెంచారు. ఫలితంగా నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ఛార్జీ రూ.20 వసూలు చేస్తున్నారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే సిటీ ఆర్డినరీ బస్సుల్లో రూ.4 పెంచారు.
Recent Comments