ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మార్పులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎన్నికలలో హామీ ఇచ్చినట్టు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తుండడంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు వెసులుబాటుగా ఉండడం లేదని భావించిన సంస్థ ఆర్టీసీ బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగించాలని యోచిస్తోంది. సిటీ బస్సులు, మెట్రో రైలు మాదిరిగా అటు ఇటు సీటింగ్ వ్యవస్థ ఏర్పాటుచేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో, ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లోని బస్సుల సీటింగ్ మార్చినట్లు సమాచారం.
ఆర్టీసీ బస్సుల్లో ఆరు సీట్ల తొలగింపు
RELATED ARTICLES
Recent Comments