కార్మికులతో చర్చలు సఫలం
స్పాట్ వాయిస్, బ్యూరో: బిగ్ న్యూస్… తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సమ్మెపై కీలక ప్రకటన వెలువడింది. బుధవారం నుంచి జరగాల్సిన రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో మే 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ గతంలో ప్రభుత్వానికి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో 3 గంటల పాటు చర్చలు జరిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో జరిగిన చర్చలు సఫలం కావడంతో కార్మికులకు ఊరట లభించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు.
ఆర్టీసీ సమ్మె వాయిదా..
RELATED ARTICLES
Recent Comments