పెరిగిన ఆర్టీసీ చార్జీలు
ప్యాసింజర్ సెస్ పేరిట వసూల్..
ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ల్లో రూ.5
సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడలో రూ.10
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ మరోసారి ప్రయాణికులపై భారం వేసింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో ప్రయాణికుల నుంచి సాధారణ చార్జీలతో పాటు అదనంగా ప్యాసింజర్ సెస్ రూ.5-10 వరకు వసూలు చేయాలని నిర్ణయించింది. ఆదివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 చొప్పున పెంచాలని, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో చిల్లర సమస్య రాకుండా రూ.10వరకు రౌండప్ చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సర్య్కులర్ జారీ చేశారు. ఇటీవలే రౌండప్ పేరిట రూ.5 వరకు చార్జీలను సవరించిన ఆర్టీసీ.. తాజాగా ప్యాసింజర్ సెస్ పేరిట రూ.5-10వరకు భారం మోపింది.
Recent Comments