9వ తేదీ నుంచి పంపిణీ
వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి గంగుల
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులు, చేతివృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గత నెలలో జరిగిన కేబినెట్లో నిర్ణయించింది. ఇందుకు విధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్సైట్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. https://tsobmmsbc.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫొటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం సహా 38 కాలంలతో సరళమైన అప్లికేషన్ను రూపొందించారు. ఈ వెబ్సైట్ ద్వారా తక్షణమే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కులవృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జూన్ 9న సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో లబ్ధదిదారులకు రూ. లక్ష పంపిణీ చేయనున్నారు.
కుల వృత్తులకు రూ.లక్ష..
RELATED ARTICLES
Recent Comments