Thursday, November 21, 2024
Homeసినిమారివ్యూ: ఆర్ ఆర్ ఆర్.. అదుర్స్..

రివ్యూ: ఆర్ ఆర్ ఆర్.. అదుర్స్..

మూవీ రివ్యూ..
స్పాట్ వాయిస్, సినిమా: ఆర్.ఆర్.ఆర్ ‘రౌద్రం రణం రుధిరం’ పేరు తగ్గట్టుగానే మూవీ పవర్ ఫుల్ గా ఉంది. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించిన మూవీ థియేటర్లను షేక్ చేస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటించారు.
ఇది కథ…
ఈ మూవీ 1920 పరిస్థితుల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో విశాఖ‌ప‌ట్టణం స‌మీపానికి చెందిన రామ‌రాజు (రామ్‌చ‌ర‌ణ్‌) పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. పై అధికారుల మెప్పు పొంది ప‌దోన్నతి పొందాలనేదే అత‌ని ఆశ‌యం. త‌న మ‌ర‌ద‌లు సీత (అలియాభ‌ట్‌)కి ఇచ్చిన మాట నెర‌వేరాలంటే ఆ ల‌క్ష్యం సాధించాల్సిందే. మ‌రోవైపు బ్రిటిష్ గవ‌ర్నర్ స్కాట్ దొర (రే స్టీవెన్‌స‌న్‌) త‌న కుటుంబంతోపాటు ఆదిలాబాద్‌ ప్రాంతాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు అక్కడ గోండు జాతికి చెందిన మ‌ల్లి అనే చిన్నారిని వాళ్లతోపాటే ఢిల్లీకి తీసుకెళ్తారు. ఇది అన్యాయం అటూ ఎదిరించిన పాప కుటుంబాన్ని హింసిస్తారు. గోండు జాతికి కాప‌రి భీమ్ (ఎన్టీఆర్‌) మ‌ల్లిని తీసుకురావ‌డం కోసం ఢిల్లీకి వస్తాడు. ఈక్రమంలో బ్రిటిష్ కోట‌ని భీమ్ దాటుకుని వెళ్లడం, పోలీస్ అధికారి రామ‌రాజుకీ, భీమ్‌కీ మ‌ధ్య ఏం జ‌రిగింది? ఆ ఇద్దరికీ భార‌త స్వాతంత్య్ర పోరాటంతో సంబంధ‌ త‌దిత‌ర విష‌యాలు ఆసక్తి కలిగిస్తాయి.
హిట్ హిట్ హిట్..
కథలో భావోద్వేగాలు హైలెట్ గా నిలిచాయి. స్టార్ హీరోల అభినయం అందరినీ మెప్పించింది. పాట‌లు, పోరాట ఘ‌ట్టాలు… ఇలా అన్ని హిట్టే. ఆర్ ఆర్ ఆర్ లోని ప్రతీ సన్నివేశం.. ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. నటులందరూ తమ పాత్రలో ఒదిగిపోయారు. సెంథిల్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా గ్రాండ్‌ లుక్‌లో చూపించారు. రాజమౌళి కన్న కలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.

 నటీనటులు

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అజయ్‌దేవ్‌గణ్‌, అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, సముద్రఖని, అలీసన్‌ డూడీ, రేస్టీవెన్‌ సన్‌, శ్రియ తదితరులు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి; సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌; ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌; కథ: కె.వి.విజయేంద్ర ప్రసాద్‌. నిర్మాత: డీవీవీ దానయ్య; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments