Wednesday, November 27, 2024
Homeతెలంగాణరోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ విప్‌ కు గాయాలు 

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ విప్‌ కు గాయాలు 

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ విప్‌ కు గాయాలు 

లారీని తప్పించబోయి బోల్తా పడిన కారు 

స్పాట్ వాయిస్, బ్యూరో: ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఆయన కారు అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ధర్మపురి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆయనతోపాటు ఇతరులకు గాయాలయ్యాయయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments