Sunday, January 5, 2025
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
స్పాట్ వాయిస్, దామెర: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన దామెర మండలం ఊరుగొండ గ్రామ శివారులో చోటు చేసుకుంది. దామెర ఎస్సై కొంక అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన మైలగాని మల్లేశం (58) వృత్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. బుధవారం విధులు ముగించుకొని ఇంటికి టూ వీలర్ పై వెళ్తుండగా.. ఊరుగొండ గ్రామ శివారులోని రాగానే వెనక నుంచి కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో మల్లేశంకు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు ఎస్సై అశోక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బెల్ట్ షాపుపై దాడులు
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్త్యాల పల్లి గ్రామంలోని ప్రొఫెసర్ జయశంకర్ సర్కిల్ వద్ద బెల్ట్ షాపు పై పోలీసులు బుధవారం దాడులు చేశారు. బెల్ట్ షాపులో రూ. 2380 విలువైన మద్యం స్వాదీనం చేసుకొని , షాపు నిర్వహిస్తున్న కేదాసి రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొంక అశోక్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments