రోడ్డు ప్రమాదంలో అడిషినల్ ఏఎస్పీ మృతి..
మూడ్రోజుల క్రితమే ఏఎస్పీగా ప్రమోషన్
స్పాట్ వాయిస్, బ్యూరో: రోడ్డుప్రమాదంలో అడిషినల్ ఏఎస్పీ టీఎం నందీశ్వర బాబ్జి ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం వాకింగ్ కోసమని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదాని వైపునకు ఏఎస్పీ బాబ్జి వెళ్లారు. జాతీయ రహదారిని ఏఎస్పీ బాబ్జి దాటే క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబ్జి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రస్తుతం ఆయన రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడ్రోజుల క్రితమే ఏఎస్పీగా ప్రమోషన్ వచ్చింది.
Recent Comments