కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం..
తెలంగాణకు చెందిన ఏడుగురు మృతి..
మరికొందరికి గాయాలు
స్పాట్ వాయిస్, క్రైమ్ : మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఏడుగురు మృతి చెందారు. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జబల్‌పూర్ వద్ద మినీ బస్సు, ట్రక్కు ఢీకొని ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్ నాచారం వాసులుగా గుర్తించారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా తొలుత ఏపీ వాసులుగా అక్కడి పోలీసులు భావించారు. ఆ తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో నాచారం వాసులుగా గుర్తించారు.
Recent Comments