ప్రమాదాల నివారణకు ఆర్చ్ ఏర్పాటు..
స్పాట్ వాయిస్, కాజీపేట: భారీ వాహనాల రాకతో కాజీపేట మండలం మడికొండ నుండి ధర్మసాగర్ వెళ్లే రహదారిలో గత కొన్ని సంవత్సరాలుగా భారీ వాహనాలు వెళ్తుండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతుండగా మడికొండ గ్రామస్తులు ప్రజాప్రతినిధులు స్థానిక సీఐ పి కిషన్ దృష్టికి తీసుకురాగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వారు వెంటనే స్పందించి విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ , వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు రైల్వే పవర్మేట్ ప్రాజెక్ట్ సహకారంతో మడికొండ చౌరస్తానందు, గ్రామ శివారు లోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద భారీ వాహనాల ప్రవేశం లేకుండా శుక్రవారం ఆర్చి కమన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అట్టి మార్గంలో రోడ్డు ప్రయాణం చేస్తూ ఏడుగురు యువకులు రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారు, మడికొండ గ్రామస్తులు పలుమార్లు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నిరసన ధర్నాలు జరిపినందుకు పలువురిపై కేసులు నమోదు అయ్యాయని, మరొక మారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో ఆర్చి కమాన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, అందుకు సహకరించిన నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు కు గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు,
Recent Comments