నలుగురికి తీవ్ర గాయాలు
ములుగు జిల్లాలో విషాదం..
ఆటోను ఢీకొన్న డీసీఎం
చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దర్గాకు వెళ్లి వస్తుండగా ఘటన
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి ప్రాణాలను హరించింది. ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఆటోను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా, మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, ఆటో డ్రైవర్ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. మృతులంతా కోమటిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), డ్రైవర్ జానీ (23) ఘటన స్థలంలోనే మృతి చెందారు. పల్లె బోయిన పద్మ, రసూల్, వెన్నెల, వసంత తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వీరంతా అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో.. ఊరు ఊరంతా కన్నీరు పెట్టింది. ములుగు జిల్లా హాస్పిటల్ వద్ద మార్చురీ లో ఉన్న మృతదేహాలను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పరిశీలించారు.
Recent Comments