మంత్రి శ్రీధర్ బాబుకు మహదేవపూర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడి కృతజ్ఞతలు
స్పాట్ వాయిస్, మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు గల రోడ్డు గుంతలు పడి భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే రోడ్డు మరమ్మత్తుల విషయంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. వెంటనే మరమ్మతులు చేసి క్షేత్రానికి రాకపోకలు కొనసాగిస్తున్న భక్తులు, ప్రయాణాలకు ఇబ్బందులు తీర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లేతకరి రాజబాపు తెలిపారు. గత బీఅర్ఎస్ ప్రభుత్వంలో రోడ్డు మరమ్మత్తులపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎవరూ పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అప్పట్లో మహదేవపూర్ నుంచి కాళేశ్వరం రహదారిపై అనేక వాహనాలు గుంతల్లో పడి ప్రమాదాలు జరిగాయని, చాలా మంది ఆసుపత్రి పాలైన సంఘటనలు ఉన్నాయని వాపోయారు. రోడ్డు మరమ్మత్తులు చేయించి సుఖవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించిన మంత్రికి మండల ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహదేవపూర్ -కాళేశ్వరం రోడ్డుకు మరమ్మతులు
RELATED ARTICLES
Recent Comments