రూ.63.88కోట్లు మంజూరు
గత సంవత్సరం వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్న రైతులకు త్వరలో చెక్కుల పంపిణీ
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతీ తండాకు వందశాతం రోడ్లు నిర్మిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడారు. గత ఏడాది సంక్రాంతి సమయంలో కురిసిన వడగళ్ల వానకు నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నాయని, వాటితో పాటు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయన్నారు. అయితే పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇటీవల ఎకరాకు రూ. 5400 చొప్పున నష్టపరిహారం విడుదల చేసిందని, వారం రోజుల్లో చెక్కులు అందజేస్తామని తెలిపారు. వర్ష ప్రభావంతో గ్రామాల్లో అంతర్గత రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్న విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, గ్రామాల్లోని అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ. 63.88 కోట్లను ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిందన్నారు. వీటికి సంబంధించి వారం రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని, వచ్చే నాలుగు నెలల్లో వీటికి సంబంధించిన పనులు పూర్తిగా అవడం జరుగుతుందన్నారు. కేవలం నర్సంపేట నియోజకవర్గం మాత్రమే ప్రత్యేక జీవో జారీ చేసిన కేసీఆర్ కు, ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీపై పీవీసీ పైప్ లైన్ యూనిట్లను అందించడం జరుగుతుందన్నారు. ఇందుకుగాను 10 వేల యూనిట్ల మంజూరుకు కృషి చేస్తామని, త్వరలో వాటికి సంబంధించిన అనుమతులు కూడా వస్తాయన్నారు. ఇందులో గతంలో పంటల నష్టపోయిన రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే సబ్సిడీపై కరెంటు మోటార్లను కూడా అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతి తండాకు రోడ్లు నిర్మిస్తాం..
RELATED ARTICLES
Recent Comments