గ్రీన్ ఫీల్డ్ హైవేతో రైతులకు నష్టం
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతి
స్పాట్ వాయిస్ దామెర: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రైతులు భారీగా నష్ట పోతున్నారని
భూనిర్వాసితుల తరఫున తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించారు. శుక్రవారం జాతీయ రహదారుల శంకుస్థాపన కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి ని శంషాబాద్ లోని నోవోటెల్ లో కోదండరాం కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం వల్ల భూపాలపల్లి హనుమకొండ ,వరంగల్ జిల్లాలోని రైతులు ఎదుర్కొనే సమస్యలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. మంథిని నుంచి వయా భూపాలపల్లి పరకాల మీదుగా గూడెప్పాడ్ , మల్లంపల్లి ,నర్సంపేట ,గూడూరు నుంచి మహబూబాబాద్ వరకు ఉన్న రోడ్డును విస్తరించుకుంటే రైతులు భూమి నష్టపోకుండా ఉంటారన్నారు. ఈ విషయపై కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించి రైతుల సమస్యలపై మరోసారి అధ్యయనం చేసి సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందుపట్ల సత్యపాల్ రెడ్డి , రైతులు బూర్గుల రామచందర్ ,బొల్లు రాజిరెడ్డి , శ్రీధర్ రెడ్డి, రాజగోపాల్ ,బొల్లు సమ్మిరెడ్డి ,నురా సంపత్, తిరుపతి ,మొగిలి, మోరే రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవేతో రైతులకు నష్టం
RELATED ARTICLES
Recent Comments