Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుగ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి

గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి

గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి

అర్హత కలిగిన వారికి 108 లో ఉద్యోగం కల్పించాలి

స్పాట్ వాయిస్, నల్లబెల్లి: గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని ఆర్ఎంపీ సంఘం మండల అధ్యక్షుడు ఊటుకూరు చక్రపాణి కోరారు. మండల కేంద్రంలోని గ్రామీణ ఆదర్శ వైద్యుల సంఘం మండల అధ్యక్షుడు ఊటకూరి చక్రపాణి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుభవం , అర్హత కలిగిన వైద్యులకు 108లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. అదేవిధంగా గ్రామీణ వైద్యులను గుర్తించి గతంలో మాదిరిగానే ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి వారికి గుర్తింపునివ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా ప్రజాసేవలో అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జంగిలి రాజు యాదవ్,కమిటీ సభ్యులు, వెంకటేశ్వరరావు, దేవేందర్, నర్సింగం, రఘుపతి, రమేష్,ప్రకాష్, శ్రీనివాస్, రాజేందర్, చాంద్ పాషా,నాగభూషన్, నన్నే సాహెబ్,దామోదర్ మండలంలోని అన్ని గ్రామాల ఆదర్శ వైద్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments