Saturday, November 16, 2024
Homeజిల్లా వార్తలుఆర్ఎంపీ మల్లన్న కుటుంబానికి అండగా ఉంటా..

ఆర్ఎంపీ మల్లన్న కుటుంబానికి అండగా ఉంటా..

ఆర్ఎంపీ మల్లన్న కుటుంబానికి అండగా ఉంటా..
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
ఆర్ఎంపీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
స్పాట్ వాయిస్, రేగొండ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్ఎంపీ బండి మల్లయ్య మృతి తీరని లోటని, ఆయన కుటుంబానికి అండగా ఉంటానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామంలో మృతుడు మల్లయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే గండ్ర పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం బండి మల్లయ్య స్మారకార్థం గణపురం మండలం ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన  హెల్త్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ఎంపీ వృత్తి చేసుకుంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మల్లన్న స్మారకార్థం తోటి ఆర్ఎంపీలు హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. మల్లన్న మృతితో వారి కుటుంబం దయనీయ పరిస్థితిలో ఉందని, ప్రభుత్వం నుంచి కొంత ఆర్థికసాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కాగా, హెల్త్ క్యాంపునకు వచ్చిన డాక్టర్ పాశం నాగరాజు, డాక్టర్ అంబిక, రాజు, వెంకట్ నారాయణకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చాగర్తి లక్ష్మీనారాయణ, దుంపిల్లపల్లి సర్పంచ్ విజయ్ కుమార్, ఆర్ఎంపీ సంఘం మండల అధ్యక్షులు కూతురు రమణ, గోపు రాంరెడ్డి, కాసం అశోక్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాగూర్ల సంతోష్, కర్రు సంపత్, శ్రీధర్, సంతోష్, రాములు, రాజు, రమేష్, చెన్నయ్య, శశిధర్, మోహన్ రెడ్డి, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments