Friday, May 2, 2025
Homeజిల్లా వార్తలువధూవరులకు రామకృష్ణ గౌడ్ దంపతుల ఆశీస్సులు

వధూవరులకు రామకృష్ణ గౌడ్ దంపతుల ఆశీస్సులు

స్పాట్ వాయిస్, టేకుమట్ల : టేకుమట్ల మండలం వెంకటరావుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నేరెళ్ల శ్రీనివాస్ కుమారుడి ఎంగేజ్మెంట్ వేడుకలకు టీ ఆర్ఎస్ కార్మిక శాఖ మండల అధ్యక్షుడు నేరెళ్ల రామకృష్ణగౌడ్ -స్వప్న దంపతులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెలిశాల గ్రామానికి చెందిన బుడిగ జంగాల నాయకుడైన తూర్పాటి ఐలయ్య కూతురు స్వరూప- చిరంజీవి ల వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అత్యధికంగా అభిమానించే నాయకుడు కూతురి వివాహానికి హాజరు కాలేకపోయారని, సిరికొండ మసాలా వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదనా చారి స్పీకర్ గా ఉన్నప్పుడు తమ బుడిగ జంగాల కులంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments