‘హాత్ మే హాత్ జోడో’ యాత్రకు సిద్ధం
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కాంగ్రెస్ లో ఒక వైపు ఒరిజనల్ -వలసవాదుల వార్ జరుగుతుండగా.. టీపీసీసీ చీఫ్ కీలక నిర్ణయం తీస్తున్నారు. జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాత్ర చేయనున్నారు. రెండు నెలలు పాటు రేవంత్ ‘హాత్ మే హాత్ జోడో’ పేరిట పాదయాత్ర చేస్తారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేయనున్నారు. అయితే ఈ పాదయాత్రలో సీనియర్ నేతలు పాల్గొంటారా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
Recent Comments