Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్కొత్త రేషన్ కార్డులొచ్చేస్తున్నాయ్..

కొత్త రేషన్ కార్డులొచ్చేస్తున్నాయ్..

గాంధీ జయంతి నుంచి  దరఖాస్తుల స్వీకరణ
స్పాట్ వాయిస్, బ్యూరో: కొత్త రేషన్​ కార్డులు జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధికారులకు సూచించారు. రేష‌న్ కార్డులు జారీకి ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించాల‌ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శులు చంద్రశేఖ‌ర్ రెడ్డి, సంగీత స‌త్యనారాయ‌ణ‌, మాణిక్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యద‌ర్శి రామ‌కృష్ణారావు, వ్యవ‌సాయ శాఖ కార్యద‌ర్శి ఎం.ర‌ఘునంద‌న్‌రావు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ప్రిన్సిప‌ల్ కార్యద‌ర్శి డి.ఎస్‌.చౌహాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు చేశారు. అయితే ఈ అంశంపై త్వరలోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వహించాల‌ని నిర్ణయించారు.
విధివిధానాల రూపకల్పన
రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలను రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు ఆదాయ పరిమితుల ప్రకారం రేషన్ కార్డులు జారీ చేసేవారు. ఇప్పుడు ఈ ఆదాయ పరిమితిని మార్చాలా, తగ్గించాలా, ఉన్నదాన్నే కొనసాగించాలా అన్నదానిపై కమిటీ కసరత్తు చేస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్​ డీఎస్​ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్​, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ, అర్బన్​ ఏరియాలుగా వార్షికాదాయ పరిమితిని అమలు చేస్తున్నారు. దీని ఆధారంగానే తెల్ల రేషన్​కార్డును ప్రభుత్వాలు ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్​ రూ.2 లక్షల్లోపు ఆదాయాన్ని కార్డుల జారీకీ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భూ విస్తీర్ణం తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments