రేషన్ కార్డుల ఎడిట్ ఆప్షన్ వార్త ఉత్తిదే..
క్లారిటీ ఇచ్చిన పౌరసరఫరాల శాఖ
స్పాట్ వాయిస్, బ్యూరో : రేషన్ కార్డుల్లో పేర్లు మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే సవరణలు, పేర్ల నమోదుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ఉత్తర్వులు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైందని వాట్సాప్‌లో ఫేక్ న్యూస్ రావడంతో ప్రజలు రాష్ట్రంలోని మీ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. వైరల్ వార్తలపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. ఈ పేర్ల మార్పులు చేర్పుల అవకాశానికి సంబంధించిన అంశంపై పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారమంతా ఫేక్ అని అధికారులు ఖండించారు. ఈ వార్తలను ప్రజలు ఎవరూ నమ్మొద్దని సూచించారు. రేషన్ కార్డుల్లో సవరణలు, పేర్లు నమోదుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు.
Recent Comments