Friday, November 22, 2024
Homeక్రైమ్రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం..

రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం..

కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి..
మరొకరికి గాయాలు
ములుగు జిల్లాలో ఘటన
‘స్పాట్ వాయిస్, ములుగు:  గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం నెలకొంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తుండగా ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. గద్దెపై ఐరన్​ పోల్​ను నాటుతుండగా అది కాస్తా పైన ఉన్న విద్యుత్​ వైర్లకు తాకింది. దీంతో ల్యాడ విజయ్, అంజిత్, చక్రిలు కరెంట్ షాక్​ కు గురై తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విజయ్, అంజిత్​లు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ ఇద్దరికి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. స్వల్ప గాయాలైన చక్రి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు యువకుల మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క హాస్పిటల్​కు చేరుకొని మృతి చెందిన విజయ్, అంజిత్​ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. తక్షణ సాయంగా ఇద్దరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. విద్యుత్ శాఖ తరఫున బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments