Monday, April 7, 2025
Homeతెలంగాణవిలేకర్లమంటూ హైవే పై వసూళ్లు..

విలేకర్లమంటూ హైవే పై వసూళ్లు..

విలేకర్లమంటూ హైవే పై వసూళ్లు..

అరెస్ట్ చేసిన పోలీసులు

స్పాట్ వాయిస్, జనగామ: హైదరాబాద్ – వరంగల్‌ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శివారులో వాహనదారుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు ఆలేరు ఎస్సై ఎండీ ఇద్రిస్‌ అలీ ఆదివారం రాత్రి వెల్లడించారు. జనగామ జిల్లా మైదం చెరువు తండాకు చెందిన ధరావత్‌ అనిల్‌ కుమార్‌, ధనావత్‌ గోపాల్‌ అర్దరాత్రి ఎన్‌హెచ్‌-163 రహదారిపై గూడ్స్ వాహనాలను ఆపుతున్నారు. విలేకరులమని, పోలీసులకు పట్టిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి తేజావత్‌ వీరేందర్‌ గూడ్స్ వాహనంతో హైదరాబాదు వైపు వెళ్తున్న క్రమంలో ఆలేరు సాయిబాబా గుడి సమీపంలో అనిల్‌కుమార్‌, గోపాల్‌ అటకాయించి రూ.10 వేలు వసూలు చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు సమాచారం అందించగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments