జర్నలిస్టుల ఆందోళన
-పుష్కరాల్లో సీఐ దురుసుతనం
-క్షమాపణ చెప్పాలని డిమాండ్
స్పాట్ వాయిస్, మహదేవపూర్: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల నుంచి కెమెరాలు, సెల్ ఫోన్స్ లాక్కొన్నారు. ఆలయం వద్ద ఫొటోలు తీస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ జానీ నర్సింహులు బెదిరింపులకు దిగాడు. సీఐ తీరుపై జర్నలిస్టుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వద్ద లాక్కున్న కెమెరాలు, సెల్ ఫోన్స్ తిరిగి ఇచ్చి, క్షమాపణలు చెప్పాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆందోళనకు దిగారు. అయితే రంగంలోకి దిగిన డీఎస్పీ కిషన్ జర్నలిస్టులతో చర్చలు జరుపుతుండగా సీఐ జానీ నర్సింహులు మరోసారి దురుసుగా ప్రవర్తించాడు. తన విధులకే జర్నలిస్టులు ఆటంకం కలిగించారని, వారి పై కేసులు నమోదు చేయాలని డీఎస్పీ తో సీఐ జానీ నర్సింహులు వాగ్వాదానికి దిగడం గమనార్హం. సీఐ జానీ నర్సింహులతో జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పించాలని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. అయితే సీఐ పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల తమ ఆందోళనమ కొనసాగిస్తున్నారు.
జర్నలిస్టుల ఆందోళన
RELATED ARTICLES
Recent Comments