Sunday, June 8, 2025
Homeజిల్లా వార్తలుఇన్ స్పైర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

ఇన్ స్పైర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

స్పాట్ వాయిస్, రేగొండ: మండల కేంద్రంలోని ఇన్ స్పైర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యూత్ సభ్యులు రెండో రోజు గురువారం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ సభ్యులు మాడగని సురేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ నిషిధర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం అధ్యక్షులు మడగని శంకర్, ఇన్ స్పైర్ యూత్ అధ్యక్షులు గండి సుమన్, ఉపాధ్యక్షులు తడక శ్రీకాంత్, యూత్ నాయకులు నాగరాజు, కిషోర్, అనిల్, రమేష్, నరేందర్, నరేష్, శివ, రాజు, రితీష్, విజయ్, అజయ్ తది తరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments