ప్రమాదకర చెట్ల తొలగింపు
పాల్గొన్న ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, డీపీఓ ఆశాలత
స్పాట్ వాయిస్,రేగొండ:.భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.కొన్ని చోట్ల రహదారుల వెంబడి పెద్ద పెద్ద చెట్లు ప్రమాదంగా ఉన్నాయి.ఈ విషయం తెల్సుకున్న డీపీఓ ఆశాలత,ఎస్సై శ్రీకాంత్ రెడ్డి రేపాక గ్రామంలోని ప్రమాదకరంగా ఉన్న చెట్లను దగ్గర ఉండి తొలగించారు.ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సత్వర చర్యలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం పట్ల గ్రామస్తులు ఎస్సై శ్రీకాంత్ రెడ్డికి,డీపీఓ ఆశాలత కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ సురేష్,గ్రామ సర్పంచ్ పొనగంటి తిరుపతి,ఉప సర్పంచ్ గుల్ల తిరుపతి, కారోబార్ యుగేందర్ రెడ్డి,కానిస్టేబుల్ లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Recent Comments