హరితహారంతో ఆహ్లాదం
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
స్పాట్ వాయిస్, మరిపెడ : తెలంగాణలో నేడు ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తోందని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో నేడు పర్యావరణం సమతుల్యం చెంది వర్షాలు సమృద్ధిగా కురిసి రెండు పంటలు పండుతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం ఎనిమిదో విడత హారితహరం, స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ గుగులోత్ రవి ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మన్ గుడిపూడి నవీన్ రావుతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. పచ్చని పర్యావరణమే భవిష్యత్ తరాలకు మనం అందించే అమూల్య సంపద అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సిందూర కుమారి, ఎంపీపీ అరుణ రాంబాబు, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో ధనుసింగ్, మెడికల్ ఆఫీసర్ రవి నాయక్, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
హరితహారంతో ఆహ్లాదం
RELATED ARTICLES
Recent Comments