స్పాట్ వాయిస్, హైదరాబాద్: అల్ప పీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో సాధారణం కంటే రెట్టింపు వర్షపాతం నమోదైంది. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రెడ్ అలర్ట్ జిల్లాలు..
వాతావరణశాఖ ఆదిలాబాద్, కోమరంభీం, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ అర్బన్.. జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని.. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
పొంగుతున్న వాగులు
భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి వరద నీరు చేరింది. రహదారులన్ని బురదమయం అయ్యాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
Recent Comments