Wednesday, January 22, 2025
Homeతెలంగాణఆ కార్డులు తీసేయ్యం..

ఆ కార్డులు తీసేయ్యం..

బరాబర్ వాళ్లకు ఇస్తం..
26 నుంచి అర్హులందరికీ కార్డులు అందజేస్తాం
పాత కార్డులు తొలగించేదిలేదు..
తప్పుడు సమాచారం నమ్మొద్దు
మంత్రి పొన్నం ప్రభాకర్
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కుల సర్వే సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తాయని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు.

2 కోట్ల 90 లక్ష రేషన్ కార్డులు..
రాష్ట్రంలో ఇప్పటికే 2 కోట్ల 90 లక్ష రేషన్​ కార్డులున్నాయని తెలిపారు. గత 10ఏళ్లుగా రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లైన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుంచి రేషన్​కార్డులు ఇస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని, రేషన్​ కార్డు అర్హత ఉండి, రాకుంటే సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం ఇవ్వాలని తెలిపారు. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే నమ్మొద్దని, ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక అధికారులను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుందన్నారు. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశామని, రైతు భరోసా 12 వేలు ఇస్తున్నాం.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments