నిధులు విడుదల చేసిన సర్కార్
స్పాట్ వాయిస్, బ్యూరో: రేవంత్ రెడ్డి సర్కార్ రైతుభరోసా నిధులను వరుసగా రిలీజ్ చేస్తోంది. జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద జనవరి 27న 563 గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం జమ చేయగా.. ఆ తర్వాత ఒక్క ఎకర, తర్వాత రెండు ఎకరాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. తాజాగా బుధవారం మూడు ఎకరాలు వరకు ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. కాగా.. రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్.. రూ.2223.46 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా.. సాగు చేస్తున్న భూమిని (ఎకరాల్లో) బట్టి వరుసగా పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రభుత్వం. మార్చిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేశారు.
Recent Comments