రేపటి నుంచి మార్చి 31 వరకు..
రైతు భరోసాపై క్లారిటీ ఇచ్చిన సీఎం..
ముందు ఎకరం నుంచి.. స్టార్ట్
స్పాట్ వాయిస్, బ్యూరో: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. రేవంత్ రెడ్డి సర్కార్ నాలుగు పథకాలు ప్రారంభించింది. ఈ మేరకు నారాయణపేట జిల్లాలోని కొడంగల నియోజకవర్గంలోని చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి సీఎం రేవంత్ రెడ్డి.. నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. రైతుభరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన ఎకరానికి రూ.12 వేలు పెట్టుబడి సాయం, భూములు లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింది సంవత్సరానికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందిచనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా.. ఈ డబ్బులు.. ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమవుతాయన్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత డబ్బులు జమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద.. ఒక్కో ఎకరానికి రూ.6 వేల చొప్పున, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున డబ్బులు జమవుతాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక గతంలో వేసినట్లే.. ఎకరం నుంచి మొదలై రెండు, మూడు, నాలుగు ఇలా పెంచుకుంటూ మార్చి 31 వరకు అందరికీ డబ్బులు జమ చేయనున్నారు.
రైతు భరోసాపై క్లారిటీ ఇచ్చిన సీఎం..
RELATED ARTICLES
Recent Comments