Friday, November 22, 2024
Homeతెలంగాణనామినేషన్ దాఖలు చేసిన రవిచంద్ర

నామినేషన్ దాఖలు చేసిన రవిచంద్ర

ఎన్నిక లాంఛనమే..
రెండేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగునున్న గాయత్రి రవి
స్పాట్ వాయిస్, బ్యూరో: టీఆర్ఎస్ అభ్యర్థి వ‌ద్దిరాజు ర‌విచంద్ర(గాయ‌త్రి ర‌వి) రాజ్యస‌భ స్థానానికి గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అసెంబ్లీలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను అందజేశారు. నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు గ‌న్‌పార్కులోని అమ‌ర‌వీరుల స్థూపానికి ర‌వి నివాళుల‌ర్పించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ర‌వి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, పువ్వాడ అజ‌య్ కుమార్, గంగుల క‌మ‌లాక‌ర్, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్, ప్రభుత్వ విప్‌లు గువ్వల బాల‌రాజు, బాల్క సుమ‌న్, ఎమ్మెల్యేలు సండ్ర వెంక‌ట‌వీర‌య్య, అరూరి ర‌మేశ్‌, ఎమ్మెల్సీ తాత మ‌ధు, రైతుబంధు స‌మితి రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈ నెల 23న నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవ ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. గాయత్రి రవి 2024 ఏప్రిల్ వరకు రెండేళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments