Sunday, September 22, 2024
Homeజనరల్ న్యూస్ఈ వారం.. మీ రాశీ ఫలం 10-04-2022 to 16-04-2022

ఈ వారం.. మీ రాశీ ఫలం 10-04-2022 to 16-04-2022

మేషం
వ్యాపారంలో మెరుగైన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమల వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో ఆప్తులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చాలా కాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం
వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి కలుగుతుంది. వారం చివరన చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పాత బాకీలు వసూలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలను రాజీ చేసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

మిథునం
ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం చివరన ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలు నచ్చవు.

కర్కాటకం
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుని బాధపడతారు.

సింహం
వృత్తి ఉద్యోగాల్లో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

కన్య
వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. దాయదులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల
అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలుంటాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట నూతనోత్సాహంతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

వృశ్చికం
వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురైనా అదిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా మార్చుకుని ముందుకుసాగుతారు.

ధనుస్సు
వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురైనా అదిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. గృహంలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

మకరం
వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహంలో దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.

కుంభం
ప్రభుత్వ వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఒక సంఘటన మానసికంగా బాధిస్తుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం
అన్ని రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు.

  • బ్రహ్మ శ్రీ డాక్టర్ అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతి
    చండి, ప్రత్యంగిరా, మహా విద్య ఉపాసకులు జ్యోతిష్య వాస్తు నిపుణులు, పంచాంగ కర్త, సిద్ధాంతి
RELATED ARTICLES

Most Popular

Recent Comments