బీజేపీకి రాపోలు రాజీనామా
టీఆర్ఎస్ లో చేరే ఛాన్స్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంపీ రాపోలు అనందభాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. రాజీనామా లేఖలో రాపోలు పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగేండ్లుగా పార్టీ నాయకత్వం తనని విస్మరించిందని ఆరోపించారు. తనను ఎన్నోసార్లు అవమానించారని, తక్కువ చేసి చూశారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో తనకి ప్రాధాన్యత లేకుండా చేసినా… అవమానాలను దిగమింగుతూనే వచ్చానన్నారు.
టీఆర్ఎస్ లోకి..
గత ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన ఆయన రెండుమూడు రోజుల్లో టీఆర్ఎస్ లో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను, పరిశ్రమ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు.
జర్నలిస్ట్ గా పని చేసిన ఆనంద భాస్కర్ రావు 2012 నుంచి 2018 వరకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2019లో ఆ పార్టీకి రాజీనామా చేసి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు.
Recent Comments